యేసు క్రీస్తు ప్రభువు తానెవరో బాహాటముగా ఎందుకు బయలుపరచలేదు?
I) యేసుక్రీస్తు ప్రభువు తన పరిపూర్ణ దైవత్వాన్ని బాహాటంగా అందరి ముందు ఎందుకు బయలుపరచలేదు?
1. "నేను దేవుడిని నన్ను ఆరాధించండి!" అని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఎందుకు చెప్పలేదు? (యేసు ప్రభువారు పరోక్షంగా తెలియజేశారు - యోహాను సువార్త 6:41,42; 8:58; 17:4,5; ఇత్యాది వచనాలు).
2. "నేనే మెస్సీయాను, నన్ను విశ్వసించండి" అని యేసు బహిరంగముగా అందరికీ ఎందుకు ప్రచారం చేసికొనలేదు? (ఏకాంతముగా ఆయన వ్యక్తపరిచారు - యోహాను సువార్త 4:28). తాను మెస్సీయా అవునో కాదో స్పష్టంగా బయలుపరచాలని యూదులు యేసు ప్రభువారిని పట్టుబట్టిరి (లూకా సువార్త 22:67-70).
3. తాను "దేవుని కుమారుడిని" అని యేసు ప్రభువారు ఎందుకు చాలా అరుదుగా మాత్రమే చెప్పేవారు? (యోహాను సువార్త 5:25; 10:36; 11:4 చూడండి). అనేక మార్లు దేవుడిని తన "తండ్రి" అని పిలవడం ద్వారా వాస్తవముగా ఆయన దానిని వ్యక్తపరిచారు (మత్తయి సువార్త 27:43). అయినప్పటికీ ఆయన మరి స్పష్టంగా చెప్పాలని యూదులు పట్టుబట్టిరి (లూకా సువార్త 22:70). "దేవుని కుమారుడు" అనే పదము మెస్సీయాకు సమాన పదముగా యూదులు వాడేవారు. కాబట్టి పైనున్న 2ను మరోసారి చదువుము.
4. అలా కాకుండా, దాదాపు ప్రతిసారి కూడా తనను తాను "మనుష్య కుమారుడు" అనే ఎందుకు ఆయన సంబోధించుకున్నారు?
5. ఇంకా, ఆయన ఎవరన్నదీ ఎవరికీ చెప్పవద్దంటూ ఆయనను సరిగా గుర్తించిన వారికి కూడా ఎందుకు ఖండితముగా ఆజ్ఞాపించారు?
i) ఆయన శిష్యులకు - ''అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.... అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.'' (మత్తయి సువార్త 16:15,16,20; మార్కు సువార్త 8:29,30 వచనాలు కూడా చూడండి)
ii) దయ్యములకు - "ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు." (మార్కు 1:34 మరియు 24,25 వచనాలను కూడా చూడండి); "అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.'' (మార్కు సువార్త 3:11,12); "ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు." (లూకా సువార్త 4:41)
iii) ఆయన నుండి స్వస్థత పొందినవారు - "యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను....." (మత్తయి సువార్త 12:15,16); "అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను." (మత్తయి సువార్త 8:3,4); "వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను." (మార్కు సువార్త 5:42-43)
6) తాను ఎవరో నిరుపించుకోవాలన్న సవాలు విసిరినప్పుడు యేసు ఎందుకు ఆ సవాలుని అంగీకరించలేదు?
i) సాతాను - "ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.... నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము....." (మత్తయి సువార్త 4:3,6)
ii) సామాన్య ప్రజలు - "ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి." (మత్తయి సువార్త 27:39-40)
iii) శాస్త్రులును, పెద్దలును, ప్రధానయాజకులు - "ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువ మీద నుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి." (మత్తయి సువార్త 27:41-43)
7) ఎందుకు యేసు ప్రజలతో ఎల్లపుడు ఉపమానరీతిగా మాటలాడారు?
"తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను - పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు... ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను: ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు..." "నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు." (మత్తయి సువార్త 13:10,11,13,14,34,35)
"ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు." (యోహాను సువార్త 1:10)
II) ఎందుకనగా అది ఒక ఆత్మీయ సత్యము; మానవ సంబంధమైనది కాదు:
1) ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రెండు సంగతులను ఉన్నవి. వాటిని ఏ వ్యక్తి తనకు తానుగా అర్థం చేసికొనలేడు. అవేవనగా -
i) నిజముగా యేసు ప్రభువారు ఎవరు - "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు." ..... "అందుకు యేసు - సీమోను బర్‍యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలుపరచలేదు." (మత్తయి సువార్త 16:15-17)
ii) యేసు క్రీస్తు ప్రభువారు చెల్లించిన ప్రాయశ్చిత్తము - "సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము... ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు." (1 కొరింథీయులకు :18; 2:14)
2) ఎందుకనగా దేవుని రహస్య జ్ఞానము కేవలం పత్యక్షతల ద్వారనే బయలుపరచబడును:
- "రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు."(ద్వితీయోపదేశకాండము 29:29)
- "ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు." (యెషయా 45:15)
- "తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను." (యెషయా.48:6)
- "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును."(యిర్మియా 33:3)
- "ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది." (దానియేలు 2:22)
- "‘వారందరును దేవునిచేత బోధింపబడుదురు’ అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది" (యోహాను సువార్త 6:45)
- "సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. ... నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపలేదు, .... అది యీ లోక జ్ఞానము కాదు, ... దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను...." (1 కొరింథీయులకు 2:1-8)
- "నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.... మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము....." (కొలొస్సయులకు 2:2,3; 4:3 - మరియు 1:26,27 కూడా చూడండి)
3) ఎందుకంటే ఈ క్రింద తెలియచేయబడిన విధానములో తప్ప ఏ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి పై విశ్వాసం ఉంచలేడు:
- అతను/ఆమె దేవుడైన తండ్రి వద్దకు ఆకర్షింపబడాలి - "తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు... తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు... తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను." (యోహాను సువార్త 6:37,44,65)
- పరిశుద్ధాత్ముడే అతడికి/ఆమెకు యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి బయలుపరుస్తాడు - "దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు... దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము." (1 కొరింథీయులకు 2:9-13)
- పరిశుద్ద లేఖనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచబడ్డారు - "యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను." (యోహాను సువార్త 20:31) (మరియు యోహాను సువార్త 5;39,40; రోమా.16:25,26; ఎఫెసీయులకు.3:4,5 కూడా చుడండి)
4) సాతాను మనుష్యుల మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను: "దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.. " (2 కొరింథీయులకు 4:4)
ఆంగ్ల మూలం - Why does Jesus not openly reveal his identity?