దేవుని మీరెలా గుర్తిస్తారు?

మనమందరము సమ్మతించే ప్రశ్నలు మరియు జవాబులు

1. మనుష్యులు ఎవరి పేరిట ప్రార్థన చేయుటకు కూడుకొందురు?  
జ) దేవుని

2.మనుష్యులు ప్రార్థన చేయుటకై కూడుకొన్నప్పుడు ఎవరి సన్నిధి వారి మధ్య ఉంటుంది?
జ) దేవునిది

3. దేవ దూతలను ఎవరు పంపిస్తారు?
జ) దేవుడు

4. పరలోకముకై ఏర్పరచబడినవారు ఎవరికి చెందినవారు?
జ) దేవునికి

5. దేవుని వెంబడించేవారితో నిత్యము ఎవరి సన్నిధి ఉంటుంది?  
జ) దేవునిది

6.పరలోకములో ఉండేదెవరు?
జ) దేవుడు

7. పరలోకములో నుండి దిగి వచ్చేదెవరు?   
జ) దేవుడు

8. నిత్య జేవము పొందుట కొరకై ఎవరి నామములో మనము విశ్వాసముంచాలి?
జ) దేవుని

9. ఆత్మ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది?
జ) దేవుని ద్వారా

10. మనకున్న ఆత్మీయ ఆకలిని దప్పికని తీర్చగలవారు ఎవరు?
జ) దేవుడు

11. అంత్యదినమున  మనుష్యులను సజీవులుగా లేపేది ఎవరు?
జ) దేవుడు

12. జీవాహారము ఎవరు?
జ) దేవుడు

13. ఎవరి మాటలు గతించిపోకుండా నిత్యమూ నిలిచి ఉంటాయి?
జ) దేవునివి

14. జీవమునిచ్చే ప్రాణ దాత ఎవరు?
జ) దేవుడు

15. జీవమైయున్నవాడు ఎవరు?
జ) దేవుడు

16. తనకొరకు మన ప్రాణం పోగొట్టుకున్నయెడల మన ప్రాణమును తిరిగి మనకివ్వగల వారెవరు?
జ) దేవుడు

17. అత్యున్నతమైన ప్రేమకు పాత్రుడైనవాడు ఎవరు?
జ) దేవుడు

18. జీవజల నదివలె దేవుని ఆత్మను మనకు ప్రసాదించగలవారెవరు?
జ) దేవుడు

19. లోకమునకు వెలుగు ఎవరు?
జ) దేవుడు

20. మనుష్యులను పాపము నుండి విడిపించగలవారెవరు?
జ) దేవుడు

21. పాపములను క్షమించే అధికారం కలిగిన వారెవరు?
జ) దేవుడు

22. నిత్యుడైన వారెవరు?
జ) దేవుడు

23. పునరుత్థానమును జీవమునైనవారెవరు?
జ) దేవుడు

24. “ఫ్రభువు” అని పిలవబడుటకు అర్హుడెవరు?
జ) దేవుడు

25. విశ్వాసులకు పరలోకములో ఒక స్థలము సిద్ధపరచ గలవారెవరు?
జ) దేవుడు

26. మనలను నిత్య జీవమునకు చేర్చగల “మార్గము” ఎవరు?
జ) దేవుడు

27. మనలను నిత్య జీవమునకు చేర్చగల “సత్యము” ఎవరు?
జ) దేవుడు

28. మంచి ఫలములు ఫలించుటకు అనగా మంచి పనులను చేయుటకు మనకు శక్తిని అనుగ్రహించేవారెవరు?
జ) దేవుడు

29. ఎవరికి దూరంగా ఉంటే నీవు ఏమీ చేయలేని వాడవైపోతావు?
జ) దేవునికి

30. మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులు కలిగిన వారెవరు?
జ) దేవుడు

31. హృదయములను మనసులను పరిశోధించే వారెవరు?
జ) దేవుడు

32. ప్రతివాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేది ఎవరు?
జ) దేవుడు

33. మనుష్యులకు తీర్పు తీర్చుటకై పరలోక మేఘములపై రాబోయేదెవరు?
జ) దేవుడు

34. సబ్బాతు దినమునకు ప్రభువు ఎవరు?
జ) దేవుడు

35. నూతన సృష్టి ద్వారా సమస్తమును పునః స్థితిస్థాపన చేయబడ్డప్పుడు తన మహిమగల సింహాసనమందు కూర్చునేదెవరు?
జ) దేవుడు

36. సమస్త జనములకు తీర్పు తీర్చే తీర్పరి ఎవరు?
జ) దేవుడు

పైనున్న లక్షణాలు దాదాపు అన్నీ కూడా కేవలం దేవునికే చెందినవని నీవు కూడా నాతో అంగీకరిస్తావా?

అంగీకరించను. (అలాగైతే, నీవు అంగీకరించకపోవుటకు కారణామేమిటో మరియు దేవుని గుర్తించటకు లేక ఎరుగుటకు ఇంకా కావలసినదేమిటో మాకు తెలుపగలరు)

అంగీకరిస్తాను. (అలాగైతే, ఈ క్రింద ఇవ్వబడిన దాని గురించి నీవింకేమంటావు?)

యేసు క్రీస్తు ప్రభువు మానవ రూపములో వచ్చిన దేవుడని క్రైస్తవులు ఎందుకు ప్రచురిస్తారు? ఈ అభిప్రాయమును లేక నమ్మకమును క్రైస్తవులు సొంతగా కనిపెట్టలేదు కాని యేసు క్రీస్తు ప్రభువే మాటి మాటికీ ఈ విషయములను వ్యక్తపరచి వివరించారు.

యేసు క్రీస్తు ప్రభువు తానే స్వయముగా ఇచ్చిన జవాబులు ఇప్పుడు చూద్దాం.

1. మనుష్యులు ఎవరి పేరిట ప్రార్థన చేయుటకు కూడుకొందురు?
జ) యేసు క్రీస్తు ప్రభువు పేరిట

ప్రభువైన యేసు చెప్పెను - “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున (ప్రార్థన చేయుటకు) ఎక్కడ కూడియుందురో”. మత్తయి 18:19,20

2.మనుష్యులు ప్రార్థన చేయుటకై కూడుకొన్నప్పుడు ఎవరి సన్నిధి వారి మధ్య ఉంటుంది?
జ) యేసు క్రీస్తు ప్రభుని సన్నిధి

ప్రభువైన యేసు చెప్పెను - “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యమ ఉందును”. మత్తయి 18:19,20

3. దేవ దూతలను ఎవరు పంపిస్తారు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “మనుష్యకుమారుడు తన దూతలను పంపును”. మత్తయి 13:41

ప్రభువైన యేసు చెప్పెను - “అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమిమీద ఉన్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు;  మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును”. మత్తయి 24:30,31 [ఇంకా మత్తయి 16:27, 25:31]

4. పరలోకముకై ఏర్పరచపడినవారు ఎవరికి చెందినవారు?
జ) యేసు క్రీస్తు ప్రభువుకు

ప్రభువైన యేసు చెప్పెను - “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.....మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు”. మత్తయి 24:30, 31

5. దేవుని వెంబడించేవారితో నిత్యము ఎవరి సన్నిధి ఉంటుంది?
జ) యేసు క్రీస్తు ప్రభుని సన్నిధి

ప్రభువైన యేసు చెప్పెను - “ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నాను”.  మత్తయి 28:20

6.పరలోకములో ఉండేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడెవడును లేడు”.  యోహాను 3:13

7. పరలోకములో నుండి దిగి వచ్చేదెవరు?  
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే”. యోహాను 6:51

ప్రభువైన యేసు చెప్పెను - “నేను పైనుండువాడను.....నేను ఈ లోకసంబంధుడను కాను”. యోహాను 8:23

ప్రభువైన యేసు చెప్పెను - “నేను తండ్రియొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానను”. యోహాను 16:28

8. నిత్య జీవము పొందుట కొరకై ఎవరి నామములో మనము విశ్వాసముంచాలి?
జ) యేసు క్రీస్తు ప్రభుని నామములో

ప్రభువైన యేసు చెప్పెను - “విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను”.  యోహాను 3:14-15
ప్రభువైన యేసు చెప్పెను - “నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు”. యోహాను 10:28

9. ఆత్మ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది?
జ) యేసు క్రీస్తు ప్రభువు ద్వారా

ప్రభువైన యేసు చెప్పెను - “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడు”. యోహాను 10:9

10. మనకున్న ఆత్మీయ ఆకలిని దప్పికని తీర్చగలవారు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

అందుకు యేసు వారితో ఇట్లనెను - “జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు”. యోహాను 6:35

11. అంత్యదినమున  మనుష్యులను సజీవులుగా లేపేది ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వాని లేపుదును”. యోహాను 6:40-44

12. జీవాహారము ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే”. యోహాను 6:48

13. ఎవరి మాటలు గతించిపోకుండా నిత్యమూ నిలిచి ఉంటాయి?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు”. మార్కు 13:31

14. జీవమునిచ్చే ప్రాణ దాత ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నన్ను తినువాడును నా మూలముగా జీవించును”. యోహాను 6:57

ప్రభువైన యేసు చెప్పెను - “ఒకడు నా మాటగైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. యోహాను 8:51

15. జీవమైయున్నవాడు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేనే జీవమునై యున్నాను”. యోహాను 14:6

16. తనకొరకు మన ప్రాణం పోగొట్టుకున్నయెడల మన ప్రాణమును తిరిగి మనకివ్వగల వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును”. మత్తయి 10:39

17. అత్యున్నతమైన ప్రేమకు పాత్రుడైనవాడు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు”. మత్తయి 10:37

18. జీవజల నదివలె దేవుని ఆత్మను మనకు ప్రసాదించగలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవజలనదులు పారును”. యోహాను 7:38

19. లోకమునకు వెలుగు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేను లోకమునకు వెలుగునైయున్నాను; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలవాడై యుండును”. యోహాను 8:12, 9:5


20. మనుష్యులను పాపము నుండి విడిపించగలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు”.  యోహాను 8:34,36

22. నిత్యుడైన వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను”. యోహాను 8:57

23. పునరుత్థానమును జీవమునైనవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును”. యోహాను 11:25

24. “ఫ్రభువు” అని పిలవబడుటకు అర్హుడెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే”. యోహాను 13:13

25. విశ్వాసులకు పరలోకములో ఒక స్థలము సిద్ధపరచ గలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను”. యోహాను 14:2

26. మనలను నిత్య జీవమునకు చేర్చగల “మార్గము” ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేనే మార్గమును”. యోహాను 14:6

27. మనలను నిత్య జీవమునకు చేర్చగల “సత్యము” ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేనే సత్యమును”. యోహాను 14:6

28. మంచి ఫలములు ఫలించుటకు అనగా మంచి పనులను చేయుటకు మనకు శక్తిని అనుగ్రహించేవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేను నిజమైన ద్రాక్షావల్లిని..... నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతటతానే యేలాగు ఫలింపదో ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు”. యోహాను 15:1-4

29. ఎవరికి దూరంగా ఉంటే నీవు ఏమీ చేయలేని వాడవైపోతావు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు”. యోహాను 15:5

30. మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులు కలిగిన వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు మృతులలోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి”. ప్రకటన 1:18

31. హృదయములను మనసులను పరిశోధించే వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేను”. ప్రకటన 2:23

32. ప్రతివాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేది ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున (ప్రతిఫలము) ఇచ్చెదను”. ప్రకటన 2:23

33. మనుష్యులకు తీర్పు తీర్చుటకై పరలోక మేఘములపై రాబోయేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి - నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవునితోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు - నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. మత్తయి 26:63,64

34. సబ్బాతు దినమునకు ప్రభువు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “మనుష్యుకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు”. మత్తయి 12:8

35. నూతన సృష్టి ద్వారా సమస్తమును పునః స్థితిస్థాపన చేయబడ్డప్పుడు తన మహిమగల సింహాసనమందు కూర్చునేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “(ప్రపంచ) పునర్జన్మమందుమనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును”. మత్తయి 19:28

36. సమస్త జనములకు తీర్పు తీర్చే తీర్పరి ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు

ప్రభువైన యేసు చెప్పెను - “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పొగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచును”. మత్తయి 25:31, 32

ప్రభువైన యేసు చెప్పెను - “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లుఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెళుకువగా ఉండుడి”. లూకా 21:36

ప్రభువైన యేసు చెప్పెను - “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు”. యోహాను 5:22, 23

యేసు ప్రభువు ఇలా అన్నారు - “నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను”. యోహాను 10:30

ఫిలిప్పు - ప్రభువా, తండ్రిని మాకుకనుపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా , యేసు ప్రభువు ఇలా అన్నారు - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? యోహాను 14:8, 9

యేసు క్రీస్తు ప్రభువు మానవ రూపములో వచ్చిన దేవుడు అని క్రైస్తవులు ఎందుకు అంటారు? క్రైస్తవులు ఈ అభిప్రాయమును తమకై తాము సొంతముగా కల్పించుకోలేదు, గాని మాటి మాటికి ఈ అభిప్రాయమును వ్యక్తపరిచి మానవులకు తెలియపరచినది యేసు క్రీస్తు ప్రభువే. క్రైస్తవులు ఆయన చెప్పిన మాటలను విశ్వసించారు, అంతే. ఈ విషయములో విభేదించేవారు, యేసు ప్రభువుతోను ఆయన  చెప్పుచున్న అభిప్రాయముతోను మరియు నిజ దేవుడైన యెహోవా దేవుని ప్రవక్తలందరి సాక్ష్యములతోనూ విభేదిస్తున్నారు. కనుక అట్టి అవిశ్వాసులకు నిత్యజీవము ఎన్నటీకీ ప్రాప్తించదు.

ఈ వ్యాసమును ఆంగ్లములో ఇక్కడ చదవగలరు


యేసు ఎవరు?

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు