ముహమ్మద్ మరియు ఆమ్ర్ బిన్ జిహాష్ హత్య

ఇబ్నె హిష్షాం రచించిన సీరత్ రసూల్ అల్లాహ్ అనే పుస్తకాన్ని ఏ.గియాం గారు "ద లైఫ్ ఆఫ్ ముహమ్మద్" అని ఆంగ్లంలోకి అనువదించారు. అందులో పేజీ 438 లో ఇలా చదువుతాం - “నీ దాయాది (కజిన్) నా పట్ల ఎలా ప్రవర్తించాడో నాకు ఏం చేయాలని ప్రయత్నించాడో నీవు చూశావా?” అని అపొస్తలుడు యామీన్‍తో చెప్పినట్టుగా యామీన్ కుటుంబికులలో ఒకరు నాకు చెప్పారు. అపొస్తలుడు ఆ మాట అన్నందువల్ల అమ్ర్ బిన్ జిహాష్‍ని చంపుటకు యామీన్ ఒకతనికి డబ్బిచ్చి చంపించాడు అని వారంటుంటారు.

ఆమ్ర్ ముహమ్మద్‍ను చంపాలని ఉద్దేశించాడనో, ఆలోచించాడనో, ప్రయత్నించాడనో లేక ప్రతిపాదించాడనో అనుకున్నా, అతనలా ఆలోచించాడు లేక ప్రయత్నించాడు అని అనుకోవడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏమనగా ముహమ్మద్‍కు అలాంటి బయలుపరపు రావటమే. ముహమ్మద్‍ను చంపాలని అతను ప్రయత్నించాడు అని చూపించే ఏ ఋజువులనుగాని ఆధారాలనుగాని ఆధారంగా చేసుకొని అతను చంపబడలేదు, కాని ముహమ్మద్‍కు కలిగిన అనుమానం వల్లనే అతను చంపబడ్డాడు.

ఆమ్ర్ బిన్ జిహాష్‍ గురించి విచారణ జరిగిన తర్వాత అతడు తీర్పుకు గురిచేయబడలేదు, కాని అతడిని చంపుటకు ఒక హంతకుడిని పంపించుటవలను అతను హత్య చేయబడ్డాడు.

గమనిక : ఈ హత్యలో ముహమ్మద్ స్వయంగా ఆమ్ర్ బిన్ జీహాష్‍ను హత్య చేయడానికి హంతకుడిని పంపినట్టు కనబడకపోయినప్పటికి, అతను హత్యగావించబడ్డ తరువాత ఆ హత్యను చేసిన వారినిగాని లేదా చేయించిన వారినిగాని ముహమ్మద్ శిక్షించినట్టుగాగాని లేదా అలాంటి హత్యలను ఖండించినట్టుగాగాని మనకు ఎక్కడా కనబడదు. పైపెచ్చు, ఇలాంటి హత్యలు చేసినవారు మరియు చేయించినవారు ముహమ్మద్‍తో అతని అనుయాయులుగా వారి జీవితకాలమంతా ఉన్నారు. దీని వలన ఈ హత్య మరియు ఇలాంటి  హత్యలన్నీ కూడా ముహమ్మద్ యొక్క అనుమతితోనే అతని మనసునెరిగిన తన అనుయాయులు చేశారని మనకు స్పష్టముగా తెలుస్తున్నది.    

ఆంగ్ల మూలం :- Muhammad And `Amr b. Jihash


ముహమ్మద్ యొక్క శత్రువులు
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు